‘తెలంగాణ’లోనూ అన్యాయమేనా? | injustices in telangana also | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ’లోనూ అన్యాయమేనా?

Nov 11 2014 3:43 AM | Updated on Sep 2 2017 4:12 PM

తెలంగాణ యూనివర్సిటీకి నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రంలోనూ....

ఆర్మూర్ టౌన్ : తెలంగాణ యూనివర్సిటీకి నిధుల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రంలోనూ అన్యాయమే జరిగిందని అఖిల భారత విద్యా పోరాట యాత్ర కన్వీనర్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌లో రూ. 7 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు.

 అఖిల భారత విద్యా పోరాట యాత్ర సోమవారం ఆర్మూర్ పట్టణానికి చేరుకుంది. యాత్రకు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం, పీవైఎల్, పీవోడబ్ల్యూ, ఏఐకేఎంఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

 అందరికీ నాణ్యమైన విద్య, సమాన ఉద్యోగ అవకాశాలకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్, డీటీఎఫ్, ఎన్‌ఎస్‌ఎఫ్‌ల రాష్ట్ర అధ్యక్షులు కొండల్‌రెడ్డి, ఆర్.నారాయణరెడ్డి, స్టాలిన్, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు సరిత, సౌందర్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు దేవరాం, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి దాసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement