అందరి సహకారం అవసరం | indrakaran reddy mission kakatiya works | Sakshi
Sakshi News home page

అందరి సహకారం అవసరం

May 6 2015 2:59 AM | Updated on Sep 3 2017 1:29 AM

మిషన్ కాకతీయకు అన్ని వర్గాల సహకారం అవసరమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ రూరల్: మిషన్ కాకతీయకు అన్ని వర్గాల సహకారం అవసరమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలోని పాతచెరువు పునరుద్ధరణ పనులను నిర్మల్ డివిజన్ పోలీసులు అధికారులు, సిబ్బంది దత్త తీసుకుని మంగళవారం శ్రమదానం చేశారు. మంత్రి, జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. పోలీసులు చెరువును దత్తత చేసుకోవడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖను ఆదర్శంగా తీసుకోని అన్ని శాఖాల అధికారులు ఒక్కో చెరువు దత్తత తీసుకుని కాకతీయ మిషన్‌ను విజయవంతం చేయాలన్నారు.

త్వరలో అమలు చేయబోయే డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని ఎల్లపెల్లిలో ప్రారంభించనున్నామన్నారు. అనంతరం ఎస్పీ తరున్‌జోషి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పోలీసు శాఖ భాగస్వామ్యం అవుతోందన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం పథకాలకు తమ శాఖ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. డీఎస్పీ మనోహర్‌రెడ్డి, ఎంపీపీ అల్లోల సుమతిరెడ్డి, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, సర్పంచ్ భీంరావు, సీఐలు పురుషోత్తమచారి, జీవన్‌రెడ్డి, ఎస్సైలు రమణమూర్తి, మహేంధర్‌రెడ్డి, సునీల్‌కుమార్, మల్లేష్, రాంనర్సింహారెడ్డి, నవీన్, శ్రీనివాస్, నాయకులు ముత్యంరెడ్డి, తుల శ్రీనివాస్, గోవర్ధన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement