జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఎంఈఓ | Indian National Flag Hoisted Reverse | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఎంఈఓ

Aug 16 2018 1:42 PM | Updated on Aug 29 2018 4:18 PM

Indian National Flag Hoisted Reverse  - Sakshi

చౌటుప్పల్‌ : జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన ఎంఈఓ రాములు  

చౌటుప్పల్‌ (మునుగోడు) :  చౌటుప్పల్‌లోని మం డల విద్యాధికారి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది.  కార్యాలయం ఆ వరణలో ఎంఈఓ బోనగిరి రాములు జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటికే అక్కడికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్ద ఎత్తునవచ్చారు. ఇదే సమయంలో ఎంఈఓ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు.  జాతీయ గీతాలాపన ప్రారంభించిన సమయంలో కొందరు పైకి చూసి విషయాన్ని గు ర్తించారు. దీంతో నాలుకర్చుకున్న ఎంఈఓ హు టాహుటిన జాతీయ పతాకాన్ని తిరిగి మార్చారు. అనంతరం మరోసారి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వ్యక్తి జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటోనని పలువురు చర్చించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement