
సాక్షి, నిర్మల్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పాలకవర్గం గడువు తీరి పోవడంతో జిల్లా పాలనాధికారి ఎం.ప్రశాంతి జెండాను ఆవిష్కరించారు. అయితే జాతీయ పతాకం అక్కడే బిగుసుకుపోవడంతో సరిగా ఎగర లేదు. అయినప్పటికీ జెండా వందనం పూర్తి చేసి హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు కలెక్టర్ ప్రశాంతి. అందరూ వెళ్లిన తర్వాత సిబ్బంది కర్రసాయంతో జెండాను బాగుచేసి ఎగిరేలా చేశారు.