చర్చలు జరిపితే సమ్మె విరమిస్తాం: జేఏసీ

If Govt Invite To Talk We Will Join In Duties Say RTC JAC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరిపితే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు  జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. సీఎం డెడ్‌లైన్‌ విధించినా ఎవరూ విధుల్లో చేరరని, చర్చలు జరిపితేనే సమ్మెను విరమిస్తామని అన్నారు. అలాగే సమ్మె కొనసాగించాలని 97 డిపోల కార్మికులు అభిప్రాయపడ్డట్లు ఆయన వెల్లడించారు. కార్మికులపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మంగళవారం అన్ని డిపోల ఎదుట మానవహారాలు చేపడుతున్నట్లు తెలిపారు.

సమ్మెపై సీఎం సమీక్ష..
మరోవైపు ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష చేపట్టారు. సీఎం పిలుపుమేరకు  రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, అడిషనల్ అడ్వకేట్ జనరల్   ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరిక, తాజా పరిణామాలపై వీరు చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీసీ సమ్మెపై కేంద్రానికి లేఖ రాయలన్న ఆలోచనలో కూడా సీఎం ఉన్నట్లు తెలుస్తోంది.  ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా 31 శాతం  ఉండటంతో వారి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top