
'ఏ సమస్య వచ్చినా నాకు చెప్పండి'
అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణపనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని రాష్ట్ర వాణిజ్యపన్నులు, సినీమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
అమీర్‌పేట: అమీర్‌పేట ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణపనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామని రాష్ట్ర వాణిజ్యపన్నులు, సినీమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం అమీర్‌పేట డివిజన్‌లో ఎస్‌ఆర్‌టీ క్వార్టర్స్ లో కాస్ట్ కాలనీలో సివరేజీ పనులను ప్రారంభించిన ఆయన మధ్యలో ఆగిపోయిన 30 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్‌ఆర్‌నగర్‌ని ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు వాహనాల రిపేరింగ్ గోడౌన్ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణపనులు పూర్తయితే ఆసుపత్రి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పనులు ఎందుకు నిలిచిపోయాయన్న దానిపై పూర్తి వివరాలు తనకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. త్వరలో వైద్యవిధాన పరిషత్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని, అవసరమైతే మరిన్ని నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయిస్తానని చెప్పారు. కాలనీల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.