గవర్నర్‌గా బాగా పనిచేస్తా! | i will done well as governor, says vidyasagar rao | Sakshi
Sakshi News home page

గవర్నర్‌గా బాగా పనిచేస్తా!

Aug 27 2014 1:44 AM | Updated on Mar 29 2019 9:24 PM

గవర్నర్‌గా బాగా పనిచేస్తా! - Sakshi

గవర్నర్‌గా బాగా పనిచేస్తా!

సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న తాను పార్టీకి, గవర్నర్ పదవికి మధ్య ఉన్న విభజనరేఖను గుర్తించి దానిని దాటకుండా వ్యవహరిస్తానని మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగరరావు తెలిపారు.

 సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న తాను పార్టీకి, గవర్నర్ పదవికి మధ్య ఉన్న  విభజనరేఖను గుర్తించి దానిని దాటకుండా వ్యవహరిస్తానని మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగరరావు తెలిపారు. పార్టీకోసం దీక్షగా పనిచేస్తున్న తనకు ఉన్నతమైన గవర్నర్ పదవి ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతతో ఉంటానన్నారు. గవర్నర్ పదవి లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే ఇంతకాలం పనిచేసిన పార్టీ కార్యకలాపాలకు దూరమవుతున్నందుకు బాధగా ఉందన్నారు. రాష్ట్రంలో తనకు అండగా నిలిచిన నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయనమాటల్లోనే....

 ఆర్‌ఎస్‌ఎస్‌లో,ఏబీవీపీలో క్రియాశీలకంగా వ్యవహరించాను. జనసంఘ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చా. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశాను. సీనియర్లు సభ్యులుగా ఉన్నప్పటికీ నన్ను శాసనసభాపక్ష నేతగా నియమించి పారీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు గవర్నర్ పదవి ఇచ్చింది. క్రమశిక్షణతో కృషి చేస్తే ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందనడానికి ఇదే నిదర్శనం.
 
 పార్టీకి మచ్చ రానివ్వను...
 
 గవర్నర్ పదవిని బాధ్యతాయుతంగా నిర్వహించాల్సి ఉంటుంది. పార్టీకి మచ్చ తెచ్చేలా వ్యవహరించను. రాజ్యాంగపదవిలోకి వస్తే పార్టీని పక్కనపెట్టాలి.  ‘గవర్నర్‌గా బాగా పనిచేశాడు’ అని అనుకునేలా నడుచుకుంటా. మహారాష్ట్ర కీలకమైన రాష్ట్రం కాబట్టి దాన్ని గమనంలో ఉంచుకుంటా. త్వరలో ఆరాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సమయంలో అక్కడికి గవర్నర్‌గా వెళ్తున్నా. గవర్నర్ అధికారాలపై వివాదాలున్నాయి... తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌కు ప్రత్యేకాధికారాల ఇచ్చే వ్యవహారం నేపథ్యంలో ఇప్పుడూ మనం చూస్తున్నాం. గవర్నర్ అధికారాలను రాజ్యాంగం ఇదివరకే స్పష్టంగా చెప్పింది. నిబంధనల ప్రకారమే నేను వ్యవహరిస్తా.
 
 వివాదాలకు దూరం...
 
 నేనెప్పుడు వివాదాల్లో లేను. గతంలో నేను బీజేపీ శాసనసభా పక్ష నేతగా, మా అన్నయ్య రాజేశ్వరరావు సీపీఐ సభాపక్ష నేతగా ఉన్నాం. విరుద్ధ భావజాల పార్టీలకు ఇద్దరం నేతృత్వం వహించినా వివాదాలు రానివ్వలేదు.
 
 వి.రామారావు ప్రోత్సహించారు...
 
  విద్యార్థి నాయకుడిగా ఉండగా పార్టీ సీనియర్ నేత వి.రామారావుతో సాన్నిహిత్యం ఉండేది. ఓ సైకిల్‌పై ఆయన దగ్గరకు వెళ్లి పార్టీ గురించి చర్చిస్తుండేవాడిని. ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. గతంలో ఆయన గవర్నర్‌గా పనిచేశారు. ఇప్పుడావకాశం నాకు దక్కింది.
 
 కత్తిపోట్లకు వెరవలేదు...
 
 ఏబీవీపీలో చురుగ్గా ఉండడంతో వామపక్ష భావజాలమున్న కొందరు నాపై కత్తితో దాడి చేశారు. గాయపడినా కొంతకాలానికే తేరుకున్నా. ఆ దాడులకు భయపడలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement