
నాకు వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం: దిగ్విజయ్
తనకు వైల్డ్ ఫోటో గ్రఫీ అంటే ఇషమని రాష్ర్ట ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
హైదరాబాద్:తనకు వైల్డ్ ఫోటో గ్రఫీ అంటే ఇషమని రాష్ర్ట ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆదివారం సాక్షితో మాట్లాడిన దిగ్విజయ్.. వన్య ప్రాణుల సంరక్షణే తన ఫోటోగ్రఫీ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి ఒక్కరూ అడవులను కాపాడగలిగితే వన్యప్రాణులను కాపాడుకోగలమని ఆయన అన్నారు.హైదరాబాద్ నగరానికి చెందిన డాక్టర్ వెంకట్ ఫోటో గ్రఫీలో తనకు గురువని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మైనారిటీ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్‌లో జరుగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఏఐసీసీ మైనారీటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్, రాష్ర్ట ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, కార్యదర్శి ఆర్.సి. కుంతియాలు హాజరుకానున్నారు.