తెలంగాణ ప్రజల అభిమానం తెలుసు | I know the passion of the people of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రజల అభిమానం తెలుసు

Nov 15 2014 1:06 AM | Updated on Sep 2 2018 5:11 PM

తెలంగాణ ప్రజల అభిమానం ఎలా ఉంటుందో తనకు తెలుసని కేంద్ర సహాయమంత్రి వై.సత్యనారాయణ(సుజనా) చౌదరి అన్నారు.

  • కేంద్ర మంత్రి సుజనా చౌదరి
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల అభిమానం ఎలా ఉంటుందో తనకు తెలుసని కేంద్ర సహాయమంత్రి వై.సత్యనారాయణ(సుజనా) చౌదరి అన్నారు. వారు అందరిపట్లా అభిమానం ప్రదర్శిస్తారన్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆశీస్సులు, ప్రధాని మోదీ సహకారంతో తనకు మంత్రి పదవి దక్కిందన్నారు.

    సుజనాను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు జూబ్లీహిల్స్‌లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం సన్మానించారు. వీరిలో ఎంపీ సీహెచ్ మల్లారెడ్డి, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఎల్.రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, సిద్ధా రాఘవరావు, సండ్ర వెంకట వీరయ్య, యరపతినేని శ్రీనివాసరావు, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎం.అరవిందకుమార్‌గౌడ్, వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ తదితరులున్నారు.

    ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దత్తత తీసుకోవాల్సిందిగా సుజనాను కోరారు. సీఎం కేసీఆర్ అసమర్థునిగా మారారని, ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి నిధులు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తమ రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు ఒక అధికారిని నియమించాలని కోరగా సుజనా అంగీకరించారు. అంతకుముందు సుజనా గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement