హైదరాబాద్ లో గ్లోబల్ ఎయిరోస్పేస్ ఎక్స్ పో! | Hyderabad to host Global Aerospace Expo | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో గ్లోబల్ ఎయిరోస్పేస్ ఎక్స్ పో!

Oct 13 2014 8:32 PM | Updated on Sep 4 2018 5:15 PM

గ్లోబల్ ఎయిరోస్పేస్ ఎక్స్ పో పేరిట అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ లో నవంబర్ లో నిర్వహించనున్నారు.

హైదరాబాద్: గ్లోబల్ ఎయిరోస్పేస్ ఎక్స్ పో పేరిట అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ లో నవంబర్ లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 12 నుంచి 14 తేది వరకు జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రారంభిస్తారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం, కీన్స్ ఎగ్జిబిషన్ సంయుక్తంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి సదస్సును కీన్స్ అనే సంస్థ భారత్ లో నిర్వహించడం ఇదే తొలిసారి. రక్షణ, వైమానిక రంగంలో అత్యాదునిక సాంకేతిక పరికరాలు, వస్తువులను ప్రదర్శనకు పెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement