ప్రాణం నిలిపేది డాక్టర్‌ : ఎస్పీ

Honors To The Doctors  - Sakshi

నల్లగొండ టౌన్‌ : మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే.. ఆ మనిషి ప్రాణాన్ని కాపాడేది డాక్టర్‌ అని ఎస్పీ ఏవి రంగనాథ్‌ అన్నారు. సోమవారం స్థానిక కీర్తి ఆస్పత్రిలో అనస్తిటిస్టŠస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. డాక్టర్లు వైద్య సేవలను అందించడంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.

సమాజంలో డాక్టర్స్‌ వృత్తి ఎంతో పవిత్రమైందని, పోలీసులు కూడా సమాజంలోని రుగ్మతలను తొలగించే పవిత్రమైన వృత్తిలో ఉన్నారని అన్నారు. ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్‌ వసంతకుమారి మాట్లాడుతూ రక్తం అందుబాటులో లేక రోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోకూదనే ఉద్దేశంతో ఐఎంఏ ఆధ్వర్యంలో అనేక రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు రక్తదానం చేశారు.

రక్తదానం చేసిన వారందరికి ఎస్పీ రంగనాథ్‌ సర్టిఫికెట్స్‌ అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ గోలి అమరేందర్‌రెడ్డి, డాక్టర్లు వేణు, యాదయ్య, పుల్లారావు, హేమలత, గౌరిశ్రీ, అనితారాణి, సుబ్బారావు, సుధాకర్, రాజశేఖర్‌రెడ్డి, నగేష్, శ్రీను, మూర్తి, లీలావతి, రమేష్, రవీంద్రనాయక్, హరిక్రిష్ణ, రాజేశ్వరి, చిరునోముల చంద్రశేఖర్, విశ్వజ్యోతి, నాగేందర్‌రెడ్డి, ఖదీర్, జగదీశ్, పురుషోత్తం, అంజిబాబు, మషిహా, మల్లేష్, స్వప్న తదతరులు పాల్గొన్నారు.

డాక్టర్‌లకు సన్మానం..

డాక్టర్స్‌డేను పురస్కరించుకుని స్థానిక కీర్తి ఆస్పత్రిలో లయన్స్‌క్లబ్‌ స్నేహా ఆధ్వర్యంలో ఐఎంఏ డాక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో నాగమణిరెడ్డి, మామిడి పద్మ, గోలి రజిన, చంద్రవతి, పుష్ఫడానియేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top