హోంగార్డు భార్య, కుమారుడు అదృశ్యం | Homeguard's wife and son missing | Sakshi
Sakshi News home page

హోంగార్డు భార్య, కుమారుడు అదృశ్యం

Feb 6 2016 7:19 PM | Updated on Sep 2 2018 4:37 PM

నగరంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు భార్య, కుమారుడు అదృశ్యం అయ్యారు.

చంద్రాయణగుట్ట (హైదరాబాద్) : నగరంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు భార్య, కుమారుడు అదృశ్యం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఎం.కౌలుట్లయ్య ఉప్పుగూడ శివాజీనగర్‌లో తన భార్య ఎం.రేణుక అలియాస్ నీలావతి(24), కుమారుడు మహేష్ రాజు (3)తో కలిసి నివాసం ఉంటున్నాడు.

కాగా గత నెల 28న కౌలుట్లయ్య తన స్వస్థలమైన కర్నూలుకు వెళ్లి 30వ తేదీ సాయంత్రం వచ్చి చూడగా భార్య, కుమారుడు కనిపించలేదు. వారి ఆచూకీ కోసం అన్ని ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement