అమరుల త్యాగాలే స్ఫూర్తి

Home Minister Mahmood Ali Speech At Police Martyrs Day - Sakshi

పోలీసు అమరుల దినోత్సవంలో హోంమంత్రి, డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు అమరుల త్యాగాలే స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, నేర రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చదిద్దేందుకు అహరి్నశలు కృషి చేస్తున్నామని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. పోలీసు అమరువీరుల దినోత్సవ వేడుకలు సోమవారం గోషామహల్‌ పోలీసు మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీ సులు విధి నిర్వహణలో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. వారి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్రంలో ఎలాంటి అలజడులు రాకుండా  పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. 1959లో చైనా–భారత్‌ సరిహద్దులో చైనా దురాక్రమ ణను అడ్డుకునేందుకు ప్రాణాలరి్పంచిన సీఆరీ్పఎఫ్‌ జవాన్ల అమరత్వానికి చిహ్నం గా ఏటా పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.

పోలీసు అమరులకు సీఎం కేసీఆర్‌ నివాళి 
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసుల నిబద్ధత, దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు ఏమాత్రం తీసిపోనిదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పేర్కొన్నారు. సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేసే క్రమంలో పోలీసులు ప్రాణాలు కూడా అరి్పస్తున్నారని, ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారు ఎప్పటికీ అమరులుగా ఉండిపోతారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top