
ప్రతీకాత్మక చిత్రం
చింతపల్లి మండలం మల్ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే..
సాక్షి, నల్గొండ : జిల్లాలో హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్&ఎస్‌బీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. వేతనాలు పెంచాలంటూ నిన్నటినుంచి సెల్‌టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నారు. చింతపల్లి మండలం మల్ గ్రామం వద్ద గత 18 గంటలుగా సెల్‌టవర్‌పైనే ఉండి కార్మికుల ఆందోళన చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా వారు వెనక్కి తగ్గటం లేదు. కార్మికుల ఆందోళనతో హైదరాబాద్‌కు నీటి సరఫరా తగ్గిపోయింది.