కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?

High Court Asks Government To Clarify On Corona Tests - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: సౌకర్యాలు లేక కరోనా నిర్ధారణ పరీక్షలు నిలిపివేస్తున్నామన్న ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ప్రకటనపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతుండగా, పరీక్షలు ఆపేశామని శ్రీనివాసరావు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శ్రీనివాసరావు ప్రజారోగ్యశాఖ సంచాలకుడిగా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. రానున్న పది రోజుల్లో 50వేల పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం, జూలై 1 నాటికి కేవలం 30,877 పరీక్షలు మాత్రమే నిర్వహించిందని, అది కూడా కేవలం 12 జిల్లాల్లో మాత్రమే నిర్వహించిందంటూ ప్రభుత్వ తీరును హైకోర్టు ఎండగట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున పరీక్షలు జరుగుతుంటే, ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నిం చింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం న్యాయస్థానానికి సమగ్ర వివరాలు అందించడం లేదంది. అరకొర వివరాలిస్తూ, కోర్టుతో పిల్లీ, ఎలుక ఆట ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అలాగే ప్రజలను సైతం తప్పుదోవ పట్టిస్తోందని మండిపడింది. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇటీవల కేంద్రం బృందం పర్యటించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైందని, ఆ వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అలాగే అసలు కంటైన్మెంట్‌ విషయంలో అనుసరిస్తున్న విధానం ఏమిటో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంటైన్మెంట్‌ ప్రాంతాల వివరాలను తమ ముందుంచాలంది. కరోనా పరీక్షలకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, లేనిపక్షంలో తదుపరి విచారణ సమయంలో స్వయంగా తమ ముందు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రజారోగ్యశాఖ సంచాలకులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, వైద్య, ఆరోగ్య శాఖ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లకు అవసరమైన రక్షణ పరికరాల అందచేత, కరోనా పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై హైకోర్టులో వేర్వేరుగా పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం పై ఉత్తర్వులు జారీ చేసింది.

అస్పష్ట నివేదికలు...
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో జరగడం లేదన్నారు. పాజిటివ్‌ కేసుల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని, ఇందుకు ప్రభుత్వ వైఖరి కారణమని వివరించారు. గత 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ 2.11 లక్షల పరీక్షలు నిర్వహించారని, కాని తెలంగాణలో మాత్రం 31,877 పరీక్షలు నిర్వహించారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడెక్కడ కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయో ఇప్పటివరకు ప్రకటించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వం న్యాయస్థానానికి అస్పష్ట నివేదికలు ఇస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇస్తున్న నివేదికలకు మద్దతుగా ఆధారాలు సమర్పించడం లేదంది. నివేదికలను అఫిడవిట్‌ల రూపంలో తమ ముందు ఉంచడం లేదని, దీంతో తప్పుకు ఎవరు బాధ్యులో వారిని ప్రశ్నించడం సాధ్యం కావడం లేదంది. కరోనాకు సంబంధించిన వివరాలను ప్రాంతీయ పత్రికల్లో మొదటి పేజీలో ప్రచురించాలని గతంలో ఆదేశించామని, పారదర్శకంగా వ్యవహరించాలని, అన్నీ విషయాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని తెలిపింది. పత్రికల్లో వివరాలు ప్రచురించకుండా ప్రభుత్వం ఎందుకు తొక్కిపెడుతోందని ప్రశ్నించింది. తాము కోరిన వివరాలతో పూర్తిస్థాయి నివేదికలు సమర్పించాలంటూ విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

11-08-2020
Aug 11, 2020, 07:59 IST
వీకెండ్‌ మూవీల్లేవు. ఫ్రెండ్స్‌తో పార్టీలు బంద్‌. అప్పుడప్పుడు వచ్చి పోయే బంధుమిత్రుల సందడి లేదు.ఇంటిల్లిపాది కలిసి వెళ్లే సరదాటూర్లు లేవు....
11-08-2020
Aug 11, 2020, 06:50 IST
సంగారెడ్డి అర్బన్‌: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో పాటు, ఐదు ఆవార్డులు సొంతం చేసుకొని...
11-08-2020
Aug 11, 2020, 06:43 IST
అనంతపురం సెంట్రల్‌: నగరంలో జాయ్‌అలుకస్, మలబార్‌గోల్డ్‌ జ్యువెలరీ నిర్వాహకులు కోవిడ్‌–19 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల అనుమతులు లేకుండా తెరవడంతో పోలీసులు...
11-08-2020
Aug 11, 2020, 06:11 IST
లండన్‌: కోవిడ్‌ –19 సీజనల్‌గా వచ్చిపోయే వైరస్‌లాగా కనిపించడం లేదని, అందుకే దీన్ని కట్టడిచేయడం కష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య...
11-08-2020
Aug 11, 2020, 05:59 IST
న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. సోమవారం కొత్తగా 62,064 కేసులు బయట...
11-08-2020
Aug 11, 2020, 05:54 IST
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 25 లక్షల పరీక్షలు...
11-08-2020
Aug 11, 2020, 05:51 IST
జెనీవా: కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకొని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విలవిల్లాడుతు న్నారు.  కడుపు నింపుకునే మార్గం లేక పలక బలపం...
11-08-2020
Aug 11, 2020, 05:49 IST
సాక్షి, అమరావతి: వచ్చే నెల రెండో వారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఎపిడెమాలజిస్ట్‌లు(అంటువ్యాధుల నిపుణులు) చెబుతున్నారు....
11-08-2020
Aug 11, 2020, 05:24 IST
ఎట్టకేలకు కరోనా నియంత్రణకు ఓ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది!
11-08-2020
Aug 11, 2020, 01:25 IST
అటో పరిశ్రమను కరోనా సంక్షోభం వెంటాడుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు...
11-08-2020
Aug 11, 2020, 00:29 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19, లాక్‌డౌన్‌ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్‌–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్‌...
11-08-2020
Aug 11, 2020, 00:09 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే,...
10-08-2020
Aug 10, 2020, 20:29 IST
సాక్షి, హైద‌రాబాద్‌: ఆగ‌స్టు 15న జ‌రగ‌నున్న‌ స‌్వాతంత్ర్య దినోత్స‌వ సంబ‌రాల‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ,...
10-08-2020
Aug 10, 2020, 19:17 IST
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 46,699 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్‌గా తేలింది.
10-08-2020
Aug 10, 2020, 18:44 IST
వెల్లింగ్టన్‌: కరోనాను క‌ట్ట‌డి చేసిన ప్రాంతం, వైర‌స్ వ్యాప్తిని నిర్మూలించిన దేశంగా న్యూజిలాండ్ చ‌రిత్ర‌కెక్కింది. అక్క‌డ 100 రోజులుగా ఒక్క...
10-08-2020
Aug 10, 2020, 17:26 IST
భోపాల్‌ : కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. కోవిడ్‌‌-19...
10-08-2020
Aug 10, 2020, 16:10 IST
వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది....
10-08-2020
Aug 10, 2020, 13:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు....
10-08-2020
Aug 10, 2020, 12:13 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 2 కోట్లకు...
10-08-2020
Aug 10, 2020, 11:48 IST
జనగామ: కరోనా మహమ్మారి ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. వైరస్‌ బారినపడి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చాలామంది ఆర్థిక...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top