పెద్దవాగుకు పోటెత్తిన వరద | Heavy water flow in Pedda Vagu | Sakshi
Sakshi News home page

పెద్దవాగుకు పోటెత్తిన వరద

Sep 13 2015 8:02 AM | Updated on Sep 3 2017 9:20 AM

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామం వద్ద ఉన్న పెద్దవాగుకు వరద నీరు విపరీతంగా చేరుతోంది.

అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామం వద్ద ఉన్న పెద్దవాగుకు వరద నీరు విపరీతంగా చేరుతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు పోటెత్తడంతో ఆదివారం ఉదయం పెద్దవాగుకు చెందిన ఒకటవ నంబరు గేటు ఎత్తివేసి 2,820 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఇంజనీర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఎక్కువైతే మళ్లీ గేటు తెరిచి నీటిని కిందికి వదలాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement