తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.
మొయినాబాద్ : తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. రెండవ శనివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో 108 ప్రదక్షిణలు నిలిపివేసి కేవలం 11 ప్రదక్షిణలకు మాత్రమే అనుమతించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రెండు వరుసల్లో మహాద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.