మళ్లీ నగరాన్ని చుట్టేసిన వర్షం.. | heavy rains in hyderabad | Sakshi
Sakshi News home page

మళ్లీ నగరాన్ని చుట్టేసిన వర్షం..

Oct 15 2017 6:22 PM | Updated on Oct 15 2017 6:55 PM

heavy rains in hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరాన్ని వర్షాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. సెలవు దినం కూడా మున్సిపల్‌ కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌లలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు సెలవు దినం కావడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు నుంచి నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. మరో నాలుగు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement