కాషాయవర్ణమైన రాజన్న సన్నిధి | heavy devoteers of vemulawada | Sakshi
Sakshi News home page

కాషాయవర్ణమైన రాజన్న సన్నిధి

May 12 2015 2:14 PM | Updated on Sep 3 2017 1:54 AM

కాషాయవర్ణమైన రాజన్న సన్నిధి

కాషాయవర్ణమైన రాజన్న సన్నిధి

వేములవాడ రాజన్నసన్నిధానం కాషాయవర్ణమైంది.

వేములవాడ అర్బన్ : వేములవాడ రాజన్నసన్నిధానం కాషాయవర్ణమైంది. బుధవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి నుంచి హనుమాన్ దీక్షాస్వాముల రాక భారీగా పెరిగిపోయింది. మంగళవారం వేకువజామునుంచే హనుమాన్ దీక్షాస్వాములు రాజన్నను దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. దీంతో ప్రసాదాల కౌంటర్ క్యూలైన్ ఆలయ ఈవో ఛాంబర్ వరకు చేరుకుంది. ఇంతేకాకుండా ఆలయ ఆవరణంతా కాషాయవర్ణంతో నిండుకుని కనిపించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆలయంలోని స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement