breaking news
devoteers
-
TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది. బస్ టికెట్ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం శుక్రవారం నుంచే అమలులోకి రానుంది. ఈ మేరకు తిరుమలకు వెళ్లే భక్తులు ఈ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ కోరారు. కాగా, తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ.. శ్రీవారి దర్శన టోకెన్ కూడా పొందే వీలు కల్పించింది. టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఈ దర్శన టికెట్లను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ లేదా అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం కలదు. అయితే, బస్ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకోవాలి. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ, టీటీడీల మధ్య అంగీకారం కుదిరింది. ఇక, టీఎస్ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు వివరించారు. www.tsrtconline.in ఆన్లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చు. కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు -
కాషాయవర్ణమైన రాజన్న సన్నిధి
వేములవాడ అర్బన్ : వేములవాడ రాజన్నసన్నిధానం కాషాయవర్ణమైంది. బుధవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి నుంచి హనుమాన్ దీక్షాస్వాముల రాక భారీగా పెరిగిపోయింది. మంగళవారం వేకువజామునుంచే హనుమాన్ దీక్షాస్వాములు రాజన్నను దర్శించుకుని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. దీంతో ప్రసాదాల కౌంటర్ క్యూలైన్ ఆలయ ఈవో ఛాంబర్ వరకు చేరుకుంది. ఇంతేకాకుండా ఆలయ ఆవరణంతా కాషాయవర్ణంతో నిండుకుని కనిపించింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆలయంలోని స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
వేములవాడకు పోటెత్తిన భక్తులు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాకు భక్తుల తాకిడి పెరిగింది. జిల్లా పరిధిలోని వేములవాడకు భక్తులు పోటెత్తారు. దీంతో దర్శనానికి దాదాపు 5 గంటల సమయం తీసుకుంటోంది. అదేవిధంగా జిల్లాలోని కొండగట్టులో సోమవారం నుంచి పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా జనాలు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. నాలుగు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.