TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌ | TSRTC Good News For Devotees Going To Tirumala | Sakshi
Sakshi News home page

TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌

Jul 1 2022 7:48 AM | Updated on Jul 1 2022 9:34 AM

TSRTC Good News For Devotees Going To Tirumala - Sakshi

సాక్షి, హైదరాబాద్: తిరుమలకు వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్తను అందించింది. బస్‌ టికెట్‌ రిజర్వేషన్ సమయంలో దర్శనం టిక్కెట్టును బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సదుపాయం శుక్రవారం నుంచే అమలులోకి రానుంది. ఈ మేరకు తిరుమలకు వెళ్లే భక్తులు ఈ అమూల్యమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ కోరారు. 

కాగా, తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ.. శ్రీవారి దర్శన టోకెన్‌ కూడా పొందే వీలు కల్పించింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఈ దర్శన టికెట్లను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా రిజర్వు చేసుకోనే అవకాశం కలదు. అయితే, బస్‌ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌ను కూడా బుక్‌ చేసుకోవాలి. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, టీటీడీల మధ్య అంగీకారం కుదిరింది.

ఇక, టీఎస్‌ఆర్టీసీ బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతీరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని, ఈ సౌకర్యం శుక్రవారం నుంచి  అమలులోకి వస్తుందని ఆర్టీసీ అధికారులు వివరించారు. www.tsrtconline.in ఆన్‌లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చు. కనీసం 7 రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement