కంపెనీలలో గ్రీవెన్స్‌ సెల్‌ తప్పనిసరి: హరీశ్‌ రావు

Harish Rao Review Meeting With Industries Officials In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి: పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం​, కరోనా నివారణకి తీసుకుంటున్న చర్యలపై ఇండస్ట్రీ యాజమాన్యాలతో, అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. యాజమాన్యాలు బస్సులలో కనీస దూరం పాటించకుండా కార్మికులను తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనిని అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నారు. కరోనాకి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. (ఇక కరువన్న మాట ఉండదు)

విశాఖ గ్యాస్‌ లికేజీ ఘటనతో జిల్లాలో అప్రమత్తం అయ్యామన్నారు. బాయిలర్‌, ఫైర్‌, సెఫ్టీ వాళ్‌లు సరిగా ఇండస్ట్రీలను తనిఖీ చేయడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో గత సంవత్సరం ఇండస్ట్రీ ప్రమాదాలతో 20 మంది చినిపోయారని, గ్యాస్‌, బాయిలర్‌ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాలకు సూచించారు. పరిశ్రమల నుంచి రాత్రి సమయంలో విషవాయువు వదులుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సెఫ్టీ అధికారులు వాళ్ల పని చేయడం లేదని యాజమాన్యాలపై ఆయన విరుచుకుపడ్డారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top