‘అనంతగిరి’ పై ఐదు గంటల సమీక్ష

harish rao review meeting on ananthagiri reservoir limits - Sakshi

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చర్చించిన హరీశ్‌

తిప్పాపూర్‌ పంప్‌హౌస్, సర్జుఫుల్‌ పనుల జాప్యంపై ఆగ్రహం

కుడి, ఎడమ కాల్వలకిరువైపులా మొక్కలు నాటాలని ఆదేశం

ఇల్లంతకుంట: కాళేశ్వరం ప్రాజెక్టు పదో ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్‌ పనులపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘ సమీక్ష నిర్వహిం చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలోని ప్రతిమ కంపెనీ క్యాంపు కార్యాలయంలో బుధవారంరాత్రి 11:30 నుంచి గురువారం తెల్లవారుజామున 3:30 గంటల  జరిగిన ఈ సమీక్ష లో నీటిపారుదలశాఖ అధికారులు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్యాం ప్రసాద్‌లాల్‌ పాల్గొన్నారు. అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్‌ ద్వారా ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ఆయకట్టుకు సాగు నీరందించే దిశగా పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏజెన్సీలను సమన్వయం చేసుకుని పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చొరవ చూపాలని సూచించారు. అనంతగిరి రిజర్వాయర్‌ నిర్మాణంతోపాటు, తిప్పాపూర్‌ సర్జుఫుల్, పంప్‌హౌస్, పనుల జాప్యంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై ఆగ్రహంవ్యక్తం చేశారు. అనంతగిరి కాలువల ద్వారా ప్రతి పల్లెలోని చెరువులు, కుంటలు నింపేలా ప్రణాళికలు రూ పొందించాలని ఆదేశించారు. కుడి, ఎడమ కాలువలకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని సూచిం చారు. పంప్‌హౌస్‌ పనులు, సర్జుఫుల్, లైనిం గ్, గేట్ల పనుల పురోగతిపై అధికారులను ఆరాతీస్తూ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని హరీశ్‌ ఆదేశించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top