చేనేత కార్మికుడి ఆత్మహత్య | handloom weaver suicide in sircilla | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికుడి ఆత్మహత్య

Nov 11 2017 2:57 PM | Updated on Nov 6 2018 8:08 PM

అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కార్మకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్లలో శనివారం వెలుగుచూసింది.

సాక్షి, సిరిసిల్ల: అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కార్మకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్లలో శనివారం వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని 23వ వార్డు బీవై నగర్‌కు చెందిన వద్నల సత్తయ్య(55) శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడుతున్నాడు.

కుమార్తె వివాహం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో పాటు.. మరింత కట్నం కావాలని ఆమెను పుట్టింటికి పంపేయడంతో.. మనస్తాపానికి గురైన సత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement