
పాముకాటుతో హమాలీ మృతి
పాముకాటుతో ఓ హమాలీ మృతి చెందిన సంఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
నష్టపరిహారం కోసం కార్మికుల ధర్నా
గజ్వేల్ రూరల్ : పాముకాటుతో ఓ హమాలీ మృతి చెందిన సంఘటన గజ్వేల్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గజ్వేల్ నగర పంచాయతీ సంగుపల్లికి చెందిన సాయిల్ల స్వామి (35) స్థానిక మార్కెట్ యార్డులో హమాలీగా పని చేస్తూ కుటుంబన్ని పోషిస్తున్నాడు. రోజులాగే మంగళవారం హమాలీ పని కోసం మార్కెట్ యార్డు వచ్చాడు, ఈ క్రమంలో మార్కెట్ యార్డులో స్వామిని పాముకాటు వేసింది. దీంతో తోటి హమాలీ కార్మికులు చికిత్స నిమిత్తం మేడ్చల్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ స్వామి మృతి చెందాడు. మృతికి భార్య ఓదవ్వ, ఇద్దరు కుమార్తెలు నాగమణి, నాగలక్ష్మి, కుమారుడు అజయ్‌లు ఉన్నారు.
నష్టపరిహరం కోసం ధర్నా : బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని యార్డు కార్యాలయం ఎదుట స్వామి మృతదేహంతో కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ధర్నా చేశారు. అయితే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మార్కెట్ యార్డు జాయింట్ డెరైక్టర్ హామీ ఇచ్చినట్లు సూపర్‌వైజర్ వీర్‌శెట్టి చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. అలాగే గడా హన్మంతరావు కూడా కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పారు. బాధిత కుటుంబాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్‌జ బూర్గులపల్లి ప్రతాపరెడ్డి పరామర్శించారు.