వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ నల్లగొండ జిల్లాలోనూ పాగా వేశాడు.
నల్లగొండ జిల్లాలో డేరా పాగా
Aug 26 2017 1:27 PM | Updated on Aug 29 2018 4:18 PM
సాక్షి, హైదరాబాద్: అత్యాచార కేసులో దోషిగా తేలి, ప్రస్తుతం రోహతక్ సునారియా జైల్లో ఉన్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోనూ పాగా వేశాడు. చిట్యాల మండలం వెలిమినేదులో 56 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలంలో డేరా సచ్చ సౌదా పేరుతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమ భూముల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతే కాక ఆ ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరగుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం డేరా సచ్చ సౌదా పేరుతో 56 ఎకరాల భూమిని అతి తక్కువ ధరతో రైతుల వద్ద కొనుగోలు చేసినట్టు సదరు గ్రామస్తులు తెలిపారు. కొనుగోలు చేసిన భూమితో పాటు అసైన్ఢ్ భూములు ఆక్రమించుకున్నారని వెల్లడించారు. ఈ ఆశ్రమంలో శ్యామ్‌లాల్ అనే వ్యక్తి నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. బాబా దోషిగా తేలడంతో ఈ భూములను పేదలకు పంపిణీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement


