నేటి నుంచే జీఎస్టీ సమావేశాలు | GST meetings are from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచే జీఎస్టీ సమావేశాలు

Sep 8 2017 12:42 AM | Updated on Sep 17 2017 6:32 PM

నేటి నుంచే జీఎస్టీ సమావేశాలు

నేటి నుంచే జీఎస్టీ సమావేశాలు

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నుంచే హైదరాబాద్‌లో అధికారిక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

రేపు హైదరాబాద్‌కు జైట్లీ
సాక్షి, హైదరాబాద్‌: వ
స్తుసేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నుంచే హైదరాబాద్‌లో అధికారిక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశ ఎజెండాపై చర్చించేందుకు గాను అన్ని రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శులు శుక్రవారం మధ్యాహ్నం నోవాటెల్‌ హోటల్‌లో సమావేశం కానున్నారు.

శనివారం కౌన్సిల్‌ సమావేశంలో చర్చించేందుకు నిర్ధారించిన ఎజెండాను మరోసారి పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు. కాగా, కౌన్సిల్‌ చైర్మన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పర్యటన కూడా ఖరారైంది. శనివారం ఉదయం జైట్లీ హైదరాబాద్‌కు రానున్నారు. సమావేశానంతరం ఆయన రాత్రి తాజ్‌ఫలక్‌నుమాలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొని, అక్కడి నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లనున్నట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement