సీట్ల సర్దుబాటు పై ఉత్కంఠ​​​​​​​​​​​​​​​​ !

Grand Alliance seats Allotment In Devarakonda - Sakshi

     దేవరకొండలో కూటమి సీటుపై ఎదురుచూపు 

     నేడు వెలువడనున్న అభ్యర్థి ప్రకటన  

సాక్షి,చింతపల్లి : గిరిజన నియోజకవర్గమైన దేవరకొండ సీటును దక్కించుకునేందుకు మహాకూటమిలోని పార్టీలు పోటీ పడుతున్నాయి. సీట్ల సర్దుబాటుతోపాటు శనివారం అభ్యర్థుల ప్రకటన వెలువరిస్తామని మహా కూటమి ముఖ్యనేతలు తాజాగా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో స్థానిక పార్టీల నాయకులు, ఓటర్లలో ఉత్కంఠ నెలకొంది.మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం కొద్ది రోజులుగా ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. మహాకూటమిలోని కాంగ్రెస్, సీపీఐ పార్టీలు దేవరకొండ స్థానాన్ని కోరుకుంటున్నాయి. గెలిచే జాబితాలో తాము ఉన్నామంటూ కాంగ్రెస్‌ ఈ స్థానాన్ని కా వాలని పట్టుబడుతుండగా, తమ సిట్టింగ్‌ స్థానం వదులుకోమంటూ సీపీఐ పట్టుదలతో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేవరకొండ స్థానం ఢిల్లీ స్థాయిలోనే చర్చ కు దారితీసింది. కూటమిలోని ఇరుపార్టీలు ఇదే స్థానం కోరుతుండడంతో దీనిపై కొద్ది రోజులుగా ఆసక్తికరంగా చర్చ సాగుతోంది.

మరోవైపు సీపీఐ నేతలు సైతం దేవరకొండకు తమకు కేటాయించారనే సంకేతాలను కొద్ది రోజులుగా ఇచ్చినప్పటికి అధికారిక ప్రకటనకాదని కాంగ్రెస్‌ కొట్టి పారేసింది. చివరకు దీపావళి రోజు తో పాటు మరుసటి రోజున జరిగిన పరి ణామాలు కూటమిలో ప్రధాన చర్చగా మా రాయి. కొన్ని ప్రసార మాద్యమాల్లో మహా కూటమి అభ్యర్థుల జాబితా ఇదేనంటూ ప్రచారం చేయడంతో పలానా పార్టికి çఫలా నా టిక్కెట్టు దక్కిందన్న విషయం నియోజకవర్గ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ విష యం ఆశావాహుల్లో కంగారు రేపింది. ఈ నేపథ్యంలో మహాకూటమిలో దేవరకొండ స్థానం చివరికి ఏ పార్టికి, ఏ అభ్యర్థికి దక్కించుకుంటారనే అంశంపై సర్వత్రా  ఆసక్తి నెలకొంది.
నేడు ఖరారయ్యే అవకాశం
మహాకూటమి పొత్తులతోపాటు ఆయా పార్టీల అభ్యర్థుల జాబితాను శనివారం వెలువరిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలి సిందే. ఇప్పటివరకు జరిగిన ప్రచారాన్ని నమ్మవద్దని అధికారిక జాబితాను ఎట్టకేలకు శనివారం వెలువరించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేవరకొండ స్థానం ఎవ్వరికి కేటాయించారనే అంశంపై స్పష్టత రానుంది. దీంతో పాటు అభ్యర్థి ప్రకటన ఖరారు కానుండడంతో ఇటు మహాకూటమితో పాటుప్రత్యర్థి పార్టీ టీఆర్‌ఎస్, బీజేపీలోనూ ఉత్కంఠ నెలకొంది. మహాకూటమిలోని కాంగ్రెస్‌ సహా సీపీఐ ఉండడంతో తమ ప్రత్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటికే బరిలో ఉన్న పార్టీలు ఎదురు చూస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి సీటు ఆశిస్తున్న ఆశావాహులు తెరవెనుక తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఏడు మండలాలకు చెందిన ఆయా పా ర్టీల శ్రేణులు తమ పార్టీ అధిష్టానం వెలువరించే ప్రకటన ఎదురు చూస్తున్నారు. నామినేషన్‌కు సమయం దగ్గరపడుతుండడంతో మహాకూటమి నుంచి అభ్యర్థి ప్రకటన వెలువడితే తుది పోరులో ఎవరు ఉం టారనే అంశంపై స్పష్టత రానుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top