ప్రసవాల సంఖ్య పెంచాలి | Sakshi
Sakshi News home page

ప్రసవాల సంఖ్య పెంచాలి

Published Fri, Nov 22 2019 8:39 AM

Govt Hospitals Should Increase The Number Of Deliveries - Sakshi

సాక్షి, మెదక్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రçసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గర్భిణులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చొరవ తీసుకోవాలని వైద్యులకు   సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రçసవాల విషయంలో పాపన్నపేట వైద్య సిబ్బంది పనితీరు బాగుందని జిల్లా వైద్యధికారి వెంకటేశ్వర్లు ప్రశంసించారు. మండల కేంద్రమైన పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల మొదటి నుంచి ఇప్పటివరకు 19 ప్రసవాలు పాపన్నపేట ఆరోగ్య కేంద్రంలో జరపడంపై వైద్య సిబ్బంది పనితీరును ప్రశంసించారు.

జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు

గర్భిణులు ప్రైవేటును ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలా చోరవ తీసుకోవాలని పేర్కొన్నారు. తమ ఆస్పత్రిలో ప్రçసవాలు బాగా జరుగుతున్నాయని సిబ్బంది కొరతవల్ల కొంత ఇబ్బంది పడుతున్నామని, మరో స్టాప్‌ నర్సును ఇవ్వాలని పీహెచ్‌సీ వైద్యుడు హరిప్రసాద్‌ కోరారు. జిల్లా వైద్యధికారికి సానుకూలంగా స్పందించారు. డెలివరీ రూం, సంపు నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. అలాగే అస్పత్రికి వచ్చే రోగులు కూర్చోవడానికి ముందు భాగంలో దాతల సహయంతో సిమెంట్‌ బెంచీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బుధవారం డెలివరీ జరిగిన ఇద్దరు మహిళలకు కేసీఆర్‌ కిట్స్‌ను అందించారు. వీరి వెంట డాక్టర్‌ హరిప్రసాద్, సీహెచ్‌ఓ చందర్, మేరీ, అలీ, పద్మ ఉన్నారు.  

Advertisement
Advertisement