శభాష్.. శివకుమార్ | government jobs at Four selected for once in siva kumar | Sakshi
Sakshi News home page

శభాష్.. శివకుమార్

Mar 20 2016 2:13 AM | Updated on Sep 3 2017 8:08 PM

శభాష్.. శివకుమార్

శభాష్.. శివకుమార్

ఒకే సారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికై శభాష్ అనిపించుకున్నాడు శివకుమార్. పాలెం గ్రామానికి చెందిన జెనిగె ......

ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక
ఎస్‌పీడీసీఎల్ రాష్ట్ర స్థాయిలో  18వ ర్యాంకు
జెన్‌కో, ట్రాన్‌‌సకో, ఎన్‌సీడీసీలోనూ ప్రతిభ

 
కొత్తకోట రూరల్ ఒకే సారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికై శభాష్ అనిపించుకున్నాడు శివకుమార్. పాలెం గ్రామానికి చెందిన జెనిగె బాలకొండయ్య, లక్ష్మి కుమారుడు శివకుమార్ ఒకటి నుంచి ఐదువరకు కొత్తకోట భారతీ విద్యామందిర్‌లో, ఆరు నుంచి పదివరకు బీచుపల్లి రెసిడెన్సియల్‌లో చదివాడు. ఇంటర్ విజయవాడలోని శ్రీ చైతన్య కాలేజీ, బీటెక్ గట్‌కేసర్‌లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో, ఎంటెక్ మీర్‌పేటలోని తీగల కృష్ణారెడ్డి  కాలేజీలో  విద్యనభ్యసించాడు. విద్యానంతరం తీగల కృష్ణారెడ్డి కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వరిస్తూ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్‌ల పరీక్ష రాసాడు.

ఈ నాలుగింటిలోనూ ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. వీటిలో ఎస్‌పీడీసీఎల్(సౌత్ పవర్ డిస్ట్రీబ్యూటర్ కార్పోరేషన్ లిమిటెడ్)లో రాష్ట్ర స్థాయి 18వ ర్యాంకు సాధించాడు. దీంతో ఎస్‌పీడీసీఎల్‌లో నియామకం అయి ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నట్లు శివకుమార్ తెలిపాడు. తండ్రి బాలకొండయ్య ఉపాధ్యాయుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తండ్రి ప్రోత్సాహంతో ఈ విజయాలు సాధించినట్లు శివకుమార్ తెలిపాడు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు నీరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు శివకుమార్‌ను అభినిందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement