మా విద్య–మా హక్కు  పేరుతో పోరాటం 

government does not take any action against those responsible for the inter  results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) జాతీయ కార్యదర్శి రుచిగుప్తా వ్యాఖ్యానించారు. విద్యార్థులు చనిపోతున్నా ఇంటర్‌ ఫలితాల వ్యవహారంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశా రు. బుధవారం గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులెవ రూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థుల పక్షాన తాము పోరాటం చేస్తామన్నారు. మా విద్య– మా హక్కు పేరుతో విద్యార్థుల పక్షాన పోరాడుతామని, పరీక్షల విధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఉద్యమిస్తామని వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top