
ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన యువతి
పెద్దపల్లి, మంథని: పదో తరగతి స్నేహితుల ఆత్మీయ సమ్మేళనంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు ఓకరినొకరం ఇష్టపడ్డాం. తన వెంటే తిరుగుతూ రాకుంటే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు పెళ్లిగురించి మాట్లాడితే కాదు పొమ్మంటున్నాడని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన బుద్ది సింధు తాను ప్రేమించిన యువకుడు పెట్టెం రజనీకాంత్ గ్రా మం మంథని మండలం మైదుపల్లిలో తల్లిదండ్రులు మహిళా సంఘాలతో కలిసి బుధవారం ప్రియుడి ఇంటిముందు టెంట్ వేసుకొని బైఠాయించింది. యువతి తెలి పిన వివరాల ప్రకారం.. 2016 జూన్ 3న జరిగిన పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మైదుపల్లి గ్రామానికి చెందిన రజనీకాంత్‌తో సింధుకు పరిచయం ఏర్పడింది. సింధు అప్పటికే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చేస్తుండగా, రజనీకాంత్ గోదావరిఖనిలో డిప్లొమా చేస్తున్నాడు.
ఈ క్రమంలో వీరు కొద్దిరోజులుగా ఫోన్‌లో మాట్లాడుకుంటూ హైదరాబాద్‌లో కలుసుకునే వారు ఈక్రమంలో తనను ప్రేమించాలని కాదంటే చస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఇద్దరి కులాలు ఒకటి కావడంతో కలిసేదానని తెలిపింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని దీంతో రెండు నెలల క్రితం మంథని సీఐని ఆశ్రయించానని గత్యంతరం లేక ప్రియుడి ఇంటి ముందు బైఠాయించానని కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో రజనీకాంత్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటానని..చావైనా..బతుకైనా ప్రేమించినవాడితోనేనని యువతి పేర్కొంది. తన కూతురు జీవితంతో ఆడుకు న్న యువకుడితోనే పెళ్లి చేయాలని యువతి తల్లిదండ్రులు ఓదమ్మ, మొగిలయ్య ఆవేదన చెందారు. యువతికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మహిళలు పేర్కొంటున్నారు.
ప్రియుడి ఆత్మహత్యాయత్నం
ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని సింధు ప్రియుడి ఇంటిముందు ఆందోళనకు దిగగా..మనస్థాపం చెందిన రజనీకాంత్ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రజనీకాంత్ ఈ ఘటతో మనస్థాపం చెంది తనపొలం వద్ద పురుగుల మదు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి మంథని సామాజిక వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్సచేసి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు.