కాలేజీ బస్సు కింద పడి చిన్నారి మృతి | Girl child dies in bus accident | Sakshi
Sakshi News home page

కాలేజీ బస్సు కింద పడి చిన్నారి మృతి

Jun 15 2015 2:58 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు రెండేళ్ల పాపను బలితీసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంకాల్‌లో ఉన్న హర్షిత ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : ఓ ఇంజనీరింగ్ కాలేజీ బస్సు రెండేళ్ల పాపను బలితీసుకుంది. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంకాల్‌లో ఉన్న హర్షిత ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాలేజీ బస్సును డ్రైవర్ రివర్స్ తీసుకుంటుండగా... అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి రెండేళ్ల కుమార్తె ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రం కింద పడడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కన్నబిడ్డ కళ్ల ముందే మృతి చెందడంతో సెక్యూరిటీ గార్డు దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement