నిర్లక్ష్యంతో నీరు వృధా.. కనెక్షన్‌ కట్‌

GHMC Commissioner Danakishore Fires on Wastage of water in Mahidipatnam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  హైదరాబాద్ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెహిదీపట్నం జంక్షన్, బస్టాండు, రైతు బజార్, వాణిజ్య సముదాయాలలో తనిఖీలు చేశారు. మెహిదీపట్నం ప్రధాన కూడలిలో మురుగు నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవ్వడం పట్ల సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెహిదీపట్నం చౌరస్తా వద్ద బహుళ అంతస్తు భవనం నుండి నీరు రోడ్డుపైకి వృధాగా రావడాన్ని దాన కిషోర్ గమనించారు. నిర్లక్ష్యంగా నీటిని వృధా చేస్తూ, రోడ్డును పాడు చేసినందుకుగాను భారీగా జరిమానా విధించారు. అంతే కాకుండా నీటి కనెక్షన్‌ను తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్వాన్ రింగ్ రోడ్ నుండి జియాగూడ మీదుగా మూసీ నది పై ఉన్న ఆక్రమణలపై సర్వే నిర్వహించాల్సిందిగా జోనల్ కమిషనర్ ముషారఫ్‌ను దాన కిషోర్ ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top