కట్టప్పలు ఉన్నారు...కేసీఆర్‌ జాగ్రత్త..! | gandra venkataramana reddy Fire on CM KCR | Sakshi
Sakshi News home page

కట్టప్పలు ఉన్నారు...కేసీఆర్‌ జాగ్రత్త..!

Apr 29 2017 2:15 AM | Updated on Aug 14 2018 11:02 AM

కట్టప్పలు ఉన్నారు...కేసీఆర్‌ జాగ్రత్త..! - Sakshi

కట్టప్పలు ఉన్నారు...కేసీఆర్‌ జాగ్రత్త..!

టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత అసలు బాహుబలి అని పొగు డుతున్న వారి మాటలు చూసి పొంగిపోవద్దని, పార్టీలో కట్టప్పలు ఉన్న సంగతిని కేసీఆర్‌ గుర్తుపెట్టుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి

పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి
వరంగల్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత అసలు బాహుబలి అని పొగు డుతున్న వారి మాటలు చూసి పొంగిపోవద్దని, పార్టీలో కట్టప్పలు ఉన్న సంగతిని కేసీఆర్‌ గుర్తుపెట్టుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లులో సభతో ప్రారంభమై అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ అదే పోరుగల్లులో జరిగిన సభతోనే తిరోగమనం ప్రారంభమైంద న్నారు.  తెలంగాణ ఆవిర్భావం అనంతరం జరిగిన భారీ సభలో ప్రాణత్యాగాలు చేసిన అమరులను, సిద్ధాంతకర్త జయశంకర్‌ ఫొటోలు పెట్టలేదని, కనీసం ఆయనను స్మరించుకోకపోవడంతో కేసీఆర్‌ నిరంకుశ నైజం బయటపడిందన్నారు. చరిత్రలో మిగిలిపోతుందని, ఇంత పెద్దగా ఎవరూ నిర్వహించలేదని డబ్బాలు కొట్టిన అవిర్భావ సభ కబాలి సినిమా మాదిరిగా మారిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement