టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి..   గంప గోవర్ధన్‌ 

 gampa govardan said TRs Party Give Development To The Telangana - Sakshi

60ఏళ్లలో లేని అభివృద్ధి నాలుగున్నరేళ్లలోనే 

మరోసారి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి 

 సాక్షి, కామారెడ్డి రూరల్‌: టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, మళ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ అన్నారు. బుధవారం మండలంలోని ఇస్రోజివాడి, గర్గుల్, తిమ్మక్‌పల్లి(జి), గూడెం, శాబ్దిపూర్‌ల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయనకు గ్రామాల్లో బ్యాండ్‌మేళాలు, బోనాలు, డప్పువాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, చేసిన అభివృద్ధి పనులను, ఎన్నికల మేనిఫెస్టోలో కొత్తగా అమలు చేయనున్న పథకాలను ప్రజలకు వివరించారు. రూ.200 ఉన్న పింఛన్‌లను వెయ్యికి పెంచామన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వచ్చే సంక్రాంతి నుంచి డబుల్‌ చేసి రూ.2016 అందజేస్తామన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా పెంచాయన్నారు. రైతు బీమా కింద రూ.5 లక్షలు అందజేస్తున్నామన్నారు. లక్ష రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. డబుల్‌ బెడ్‌రూం పథకం కింద ఇళ్ల స్థలాలు ఉన్నవారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. 3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. అందరి ఆశీర్వాదంతో మళ్లీ గాఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్‌ పెద్దన్న తిరిగి సీఎం కావడం ఖాయమన్నారు. ఎంపీపీ లద్దూరి మంగమ్మ, వైస్‌ ఎంపీపీ పోలీసు క్రిష్ణాజీరావు, ఏఎంసీ చైర్మన్‌ గోపిగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, ఆత్మకమిటీ చైర్మన్‌ బల్వంత్‌రావు, నిట్టు వేణుగోపాల్‌రావు, మాజీ సర్పంచ్‌లు భాగ్యవతి, మొగుళ్ల శ్యామల, సాయాగౌడ్, గుడుగుల బాల్‌రాజు, తెడ్డు రమేష్, చింతల రవితేజగౌడ్, కడారి మల్లేష్, మోహన్‌రావు, రవీందర్‌రెడ్డి, పద్మారెడ్డి, బంటు రాజు, గరిగె కిష్టాగౌడ్‌ పాల్గొన్నారు.   

టీఆర్‌ఎస్‌లో యాదవ సంఘం ప్రతినిధుల చేరిక 

మండలంలోని లింగాపూర్‌ గ్రామానికి చెందిన యాదవ సంఘం ప్రతినిధులు బుధవారం గంప గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, ఎంపీపీ లద్దూరి మంగమ్మ, బండారి నర్సారెడ్డి, బండారి రాంరెడ్డి, గంగుల నర్సారెడ్డి, తోట సంగమేశ్వర్, పందిరి శ్రీనివాస్‌రెడ్డి, షానూర్‌ పాల్గొన్నారు.  

అంకుల్‌ ఆల్‌ ద బెస్ట్‌ 

అంకుల్‌ ఆల్‌ ద బెస్ట్‌ అంటూ చిన్నారులు దీవించారు. మండలంలోని బుధవారం ఇస్రోజివాడి, గర్గుల్‌ గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నారులను ఎత్తుకుని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top