'గాంధీ' వైద్య విద్యార్థిని అదృశ్యం | gadi medical student missing case filed | Sakshi
Sakshi News home page

'గాంధీ' వైద్య విద్యార్థిని అదృశ్యం

Published Tue, Dec 1 2015 8:37 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

గాంధీ మెడికల్ కళాశాలలో చదివే ఓ విద్యార్థిని అదృశ్యం అయింది.

అత్తాపూర్ (రంగారెడ్డి): గాంధీ మెడికల్ కళాశాలలో చదివే ఓ విద్యార్థిని అదృశ్యం అయింది. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన శ్రీనివాసచారీ కుమార్తె విజయలక్ష్మి(25) సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో చదువుతోంది. 

రోజు మాదిరిగానే సోమవారం ఉయదం కళాశాలకు వెళ్లినవిజయలక్ష్మి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కుటుంబ సభ్యులు తెలిసిన వారితోపాటు బంధువులు, స్నేహితుల్ని విచారించారు. ఫలితం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement