భద్రతకు భారీగా కేటాయింపులు | funds allocations for high security in budget | Sakshi
Sakshi News home page

భద్రతకు భారీగా కేటాయింపులు

Nov 6 2014 1:47 AM | Updated on Mar 28 2018 11:11 AM

పోలీసు శాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బడ్జెట్‌ను అందించింది.

 పోలీసు శాఖ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బడ్జెట్‌ను అందించింది. జంట పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.186 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాల్లో కేటాయించింది. నగరాన్ని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా తీర్చి దిద్దేందుకు ప్రాణాళిక బడ్జెట్ కింద నగర పోలీసు కమిషనరేట్‌కు రూ.116 కోట్లు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు రూ.70 కోట్లు అందించింది. పోలీసు శాఖను మరింత బలోపేతం చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

 ప్రతీ ఏటా నగర పోలీసు శాఖకు ప్రణాళికేతర బడ్జెట్‌ను మాత్రమే ప్రభుత్వం కేటాయించేది. ఈ సారి అలా కాకుండా ప్రణాళికా బడ్జెట్ కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.  

 నగరంలోని బంజారాహిల్స్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన నగర పోలీసు ప్రధాన కార్యాలయ భారీ భవనానికి ప్రత్యేకంగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. దీంతో త్వరలో భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగనున్నాయి. ఇక ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థకు కూడా పెద్ద పీట వేశారు. ప్రతీ పోలీసు స్టేషన్‌లో ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇక నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు సీసీటీవీ సర్వెలెన్స్ ప్రాజెక్ట్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఏకంగా రూ.69.59 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య నివారణ కోసం కూడా ఇందులో నిధులు కేటాయించారు. అలాగే, నేరాల అదుపు, కరుడు గట్టిన నేరస్తుల ఆట కట్టించేందుకు టెక్నాలజీ అభివృద్దికి కూడా ప్రత్యేకంగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. భద్రతకు భారీగా నిధులు కేటాయించడంపై జంట జిల్లాల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 నగర కమిషనరేట్ కు..
రూ.20 కోట్లు:  కొత్తగా నిర్మించనున్న కమిషనర్ ప్రధాన కార్యాలయం.
 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్‌మెంట్
రూ.20 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్‌లో సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ డెలివరీ యూనిట్ ఏర్పాటు
రూ.44.59 కోట్లు: సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాజెక్ట్
రూ.21.41 కోట్లు- ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఆటోమెటిక్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ మేనేజ్‌మెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్
రూ.10 కోట్లు-నేరాలు, నేరస్తుల ఆట కట్టించేందు కు సరికొత్త టెక్నాలజీని సమకూర్చుకునేందుకు

 సైబరాబాద్ కమిషనరేట్‌కు...
కేటాయించింది మొత్తం  రూ.70 కోట్లు
రూ.25 కోట్లు: సీసీ కెమెరాల ఏర్పాటు
రూ.45 కోట్లు: ప్రతి పోలీసు స్టేషన్‌లో ఆధునిక రిసెప్షన్ సెంటర్లు, టాయిలెట్స్, బారికేడ్లు,
గచ్చిబౌలిలోని కమిషనరేట్ భవనంపై అదన ంగా మరో అంతస్తు నిర్మాణం, కమాండ్ కంట్రో ల్ సెంటర్, ఆదిబట్ల, గచ్చిబౌలి, జవహర్‌నగర్, మహిళా పోలీసు స్టేషన్ లకు పక్కా భవనాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement