ఆకాంక్షలు నెరవేర్చేలా ఒత్తిడి | Fulfill the aspirations of the pressure | Sakshi
Sakshi News home page

ఆకాంక్షలు నెరవేర్చేలా ఒత్తిడి

Feb 7 2015 3:11 AM | Updated on Sep 2 2017 8:54 PM

ఆకాంక్షలు నెరవేర్చేలా ఒత్తిడి

ఆకాంక్షలు నెరవేర్చేలా ఒత్తిడి

'పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. మన వాళ్లే రాజకీయంగా అధికారంలోకి వచ్చారు... మన సమస్యలు తీరుతాయని ప్రజల్లో అకాంక్ష బలంగా ఉంది, ఈ మేరకు ప్రభుత్వం వాటిని నెరవేర్చాల్సి ఉంటుంది' అని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు.

వరంగల్ : 'పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. మన వాళ్లే రాజకీయంగా అధికారంలోకి వచ్చారు... మన సమస్యలు తీరుతాయని ప్రజల్లో అకాంక్ష బలంగా ఉంది, ఈ మేరకు ప్రభుత్వం వాటిని నెరవేర్చాల్సి ఉంటుంది' అని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. తమ ఆకాంక్షలు నెరవేరాలంటే పౌర సమాజంకూడా మరింత చైతన్యవంతులై తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో 'రీ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ ఇష్యూస్ అండ్ చాలెంజెస్' అంశంపై రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. సదస్సులో హరగోపాల్ కీలకోపన్యాసం చేశారు.

వ్యవసాయం బాగు పడుతుందని రైతులు, ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు, ఏదో ఒక మేలు జరుగుతుందని ఆయా వర్గాల ప్రజలు ఆశతో ఉన్నా రని, ఇందుకనుగుణంగా ప్రభుత్వం  చర్యలు చేపట్టాని సూచించారు.  ప్రపంచబ్యాంకు విధానాలను కాకుండా ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా టీఆర్‌ఎస్ పాలన కొనసాగించాలన్నారు. 2004లో చంద్రబాబు గెలిచి ఉంటే ప్రధానమంత్రిని చేయాలని ప్రపంచ బ్యాంక్ భావిం చిందని, అయితే తెలుగు ప్రజలు చైతన్యంతో నాడు చంద్రబాబును ఓడించటం మంచిదైందన్నారు.

మాట వినలేదని వైఎస్ ప్రభుత్వానికి అప్పు ఇవ్వని ప్రపంచబ్యాంక్
అప్పటి సీఎంగా రాజశేఖరరెడ్డి ప్రపంచబ్యాంకు విధానాలను అనుసరించలేదని, అభివృద్ధి నమూ నాకు మార్పులు చేసి పథకాలను కొనసాగించారని హరగోపాల్ అన్నారు.  వైఎస్ తన మాట వినడం లేదని ప్రపంచబ్యాంక్ అప్పులు ఇవ్వలేదన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement