ఆస్తిలో వాటా కోసం ట్యాంకెక్కిన చెల్లెళ్లు | from the top of the water tank sisters threatened their brothers | Sakshi
Sakshi News home page

ఆస్తిలో వాటా కోసం ట్యాంకెక్కిన చెల్లెళ్లు

Jan 18 2015 6:30 PM | Updated on Nov 6 2018 4:13 PM

అక్క ఆస్తి కోసం ట్యాంక్ ఎక్కి కిందికి దూకుతామని బెదిరించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది.

అక్క ఆస్తి కోసం ట్యాంక్ ఎక్కి కిందికి దూకుతామని బెదిరించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. గురవవ్వ(60) భర్త 20 సంవత్సరాల క్రితం మరణించాడు. గురవవ్వకు ముగ్గురు చెల్లెళ్లు, ఐదుగురు తమ్ముళ్లు. గురవవ్వకు పిల్లలు లేకపోవడంతో ఆస్తి అందరికీ సమానంగా పంచుతామని ఆమె తెలిపింది.

అందుకు తమ్ముళ్లు ఒప్పుకోలేదు. ఆస్తి కోసం గతంలో పలుమార్లు చెల్లెళ్లు, తమ్ముళ్ల మధ్య పంచాయతీ జరిగింది. తమ్ముళ్లు, ఆస్తి చెల్లెళ్లకు ఇవ్వడానికి నిరాకరించారు. ఎంతకీ సమస్య తేలకపోవడంతో ఆదివారం ట్యాంక్ ఎక్కి దూకతామని చెల్లెళ్లు బెదిరించటంతో స్థానిక ఎస్‌ఐ ఘటనా స్థలికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని ఎస్‌ఐ హామీ ఇవ్వడంతో ట్యాంక్ ఎక్కిన చెల్లెళ్లు దిగి వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement