
ఇంద్రసేనారెడ్డి మృతదేహం, సమరయోధుడికి పాదాభివందనం చేస్తున్న ప్రధాని మోదీ (ఫైల్)
పెద్దవూర (నాగార్జునసాగర్) : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోదుడు యడవెల్లి ఇంద్రసేనారెడ్డి(88) శుక్రవారం స్వగ్రామమైన మండలంలోని తెప్పలమడుగులో గుండెపోటుతో మృతిచెందారు. ఆయ న మరణవార్త తెలుసుకుని గ్రామస్తులు, సమీప గ్రామాల ప్రజలు, బంధుమిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతదేహాన్ని సం దర్శించి నివాళులు అర్పించారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో అందించిన సేవలు, నాడు రజాకార్లు సాగించిన దమనకాండను ఎదురిం చి తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి యడవెల్లి ఇంద్రసేనారెడ్డి.
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రచార వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నమస్కరించి, పాదా భివందనం చేశారు. మీలాంటి వ్యక్తులు నూటికి ఒక్కరు కూడా ఉండరని మోదీ కొనియాడినట్లు చేప్పేవా రని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆయన మృతదేహంపై జాతీయ పతాకాన్ని ఉంచారు. ఆదివారం ఆయన అంత్యక్రియలను గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.