ఉద్యోగులు, పెన్షనర్లకు కంటివైద్య శిబిరం | free eye camp for employees and pensioners | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు, పెన్షనర్లకు కంటివైద్య శిబిరం

Aug 31 2015 6:04 PM | Updated on Sep 3 2017 8:29 AM

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ప్రతి నెలా ఒకటి, మూడో గురువారాల్లో నల్లగొండలోని జిల్లా పరిషత్ వెనక గల పెన్షనర్ల సామాజిక సేవా సదన్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.దామోదరరెడ్డి, కార్యదర్శి ఎం.ఎ. అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ప్రతి నెలా ఒకటి, మూడో గురువారాల్లో నల్లగొండలోని జిల్లా పరిషత్ వెనక గల పెన్షనర్ల సామాజిక సేవా సదన్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.దామోదరరెడ్డి, కార్యదర్శి ఎం.ఎ. అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరంలో ప్రాథమిక కంటి చూపు పరీక్ష, కళ్లజోడు పరీక్ష, కంటి ఒత్తిడి, నరాల పరీక్షలు నిర్వహిస్తారు.

కంటిలో శుక్లం, రెటీనా, గ్లకోమా లాంటి శస్త్ర చికిత్సలు అవసరమైతే రాజమండ్రిలోని ఆస్పత్రిలో చేస్తారు. ఈ పరీక్షలన్నింటినీ హెల్తు కార్డులు గల రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యులకు రుసుము లేకుండా అందజేస్తారు. ప్రాథమిక పరీక్షల అనంతరం, ఆపరేషన్ కు సిద్ధపడినవారికి ఏసీ బస్సులో ప్రయాణ సౌకర్యం, వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవాలని దామోదర్ రెడ్డి, అజీజ్ కోరారు. శిబిరానికి సంబంధించిన ఇతర వివరాలకు 9100447444/ 9100448444 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement