రోడ్డుదాటుతున్న చిన్నారిని ప్రమాదవశాత్తూ ఓ జీపు ఢీకొట్టింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలకేంద్రంలోని టీవీఎస్ షోరూం ఎదుట గురువారం చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ (ఖానాపూర్) : రోడ్డుదాటుతున్న చిన్నారిని ప్రమాదవశాత్తూ ఓ జీపు ఢీకొట్టింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలకేంద్రంలోని టీవీఎస్ షోరూం ఎదుట గురువారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి గంగోత్రి(4) తలకు తీవ్ర గాయమైంది.
చిన్నారి పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన చిన్నారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తున్నారు.


