చెరుకు ముత్యంరెడ్డి అంత్యక్రియలు పూర్తి

Former Minister Cheruku Muthyam Reddy Funeral In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట: మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యియి. ముత్యంరెడ్డి స్వస్థలం తొగుట మండలంలోని తిక్కాపూర్‌ గ్రామంలో జరిగిన ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అందులో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు ముత్యంరెడ్డి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

ఆయనతోపాటు ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్, మాజీమంత్రి సునీతా లక్ష్మా రెడ్డి, కార్పోరేషన్ ఛైర్మన్‌లు ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వేలెటి రాధాకృష్ణ శర్మ, బక్కి వెంకటయ్య తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, ముత్యం రెడ్డి అభిమానులు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముత్యం రెడ్డికి సంతాప సూచకంగా గౌరవ వందనం సమర్పించి పోలీసులు 3 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. కాగా ముత్యంరెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top