
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయ న్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ ఎం.కోదండరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాములు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆధారాలతో ఆయనకు గత నెల 18న షోకాజ్ నోటీసు జారీ చేసి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరామని, అయినా ఆయన స్పందించకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, రాములు సస్పెన్షన్‌కు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఘటన కారణమని తెలుస్తోంది.