ఐదేళ్ల బుడత.. భూ యజమాని  | Five years old boy received the pass book as Land owner | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బుడత.. భూ యజమాని 

Jun 13 2019 3:39 AM | Updated on Jun 13 2019 3:39 AM

Five years old boy received the pass book as Land owner - Sakshi

కోస్గి: ఐదేళ్ల బుడతడు భూ యజమానిగా మారి స్వయంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టదారు పాసు పుస్తకం అందుకున్నాడు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం లోదిపూర్‌కు చెందిన మోహన్‌రెడ్డి, లక్ష్మి దంపతులు చనిపోవడంతో వారిపేరు మీద ఉన్న 9 కుంటల భూమిని ఐదేళ్ల వారి కుమారుడు చరణ్‌ పేరున విరాసత్‌ చేశారు.

ఈ మేరకు చరణ్‌ పేరుపై కొత్త పాసుబుక్కు రావడంతో నాయనమ్మ, తాతయ్యలతో వచ్చి కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి చేతుల మీదుగా పట్టదారు పాసు బుక్కు అందుకున్నాడు. ఐదేళ్లకే పట్టదారు అయ్యాడంటూ సభకు వచ్చిన వారు బాబును అభినందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement