
హైదరాబాద్: ఓ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్..మరో చీఫ్ సూపరింటెండెంట్, ఒక ఇన్విజిలేటర్.. కాపలాగా హోంగార్డు.. తనిఖీ నిమిత్తం స్క్వాడ్.. ఇలా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం ఆయా కేంద్రాల వద్ద విద్యాశాఖ నియమించిన అధికారులు. ఈ అధికారులంతా ఒకే ఒక విద్యార్థి కోసం విధులు నిర్వర్తించిన ఘటన కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
గురువారం జరిగిన సోషల్ పేపర్–1కు మొత్తం 11 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా సాయి సందీప్ అనే విద్యార్థి మాత్రమే పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఈ ఒక్కడి కోసం వీరంతా తమ విధుల్ని నిర్వర్తించారు. విషయం తెలుసుకున్న ‘సాక్షి’ప్రతినిధి స్కూల్‌కు చేరుకుని సాయి సందీప్‌ను పరీక్ష ఎలా రాశావని పలకరించగా అతడు నవ్వుతూ వెళ్లిపోయాడు.