'జయశంకర్'లో ముగిసిన మొదటి విడత కౌన్సెలింగ్ | first phase councelling completes in jayasankar university | Sakshi
Sakshi News home page

'జయశంకర్'లో ముగిసిన మొదటి విడత కౌన్సెలింగ్

Aug 23 2015 10:26 AM | Updated on Jun 4 2019 5:04 PM

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల మొదటి విడత కౌన్సెలింగ్ శనివారం ముగిసింది.

హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న బీఎస్సీ అగ్రికల్చర్, బీవీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల మొదటి విడత కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. బీఎస్సీ అగ్రికల్చర్‌లో 312 సీట్లకుగాను 285 సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే బీఎస్సీ హార్టికల్చర్‌లో 100 సీట్లకు గాను 59 సీట్లు భర్తీ అయ్యాయి. బీఎస్సీ సీఏబీఎంలో 15 సీట్లు భర్తీ అయ్యాయి. ఫుడ్ టెక్నాలజీలో 15 సీట్లకు గాను 4 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. బీఎస్సీ ఫిషరీస్‌లో 2 సీట్లు భ ర్తీ అయినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.వీ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో  రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని  తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement