నల్లగొండ జిల్లాలో కాల్పుల కలకలం | firing incident happened in aravapalli on saturday morning | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో కాల్పుల కలకలం

Apr 4 2015 7:09 AM | Updated on Sep 2 2017 11:51 PM

ఆయుధాలతో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వ్యక్తిని బెదిరించి అతడి బైక్ ను ఎత్తుకెళ్లారు.

నల్లగొండ : ఆయుధాలతో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు వ్యక్తిని బెదిరించి అతడి బైక్ ను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం నల్లగొండ జిల్లా అరవపల్లి మండలం సీతారాంపేటలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను వెంబడించారు. దీంతో నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. సూర్యాపేట ఘటన మరవకముందే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నిందితులు సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులు అయిఉండవచ్చనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బైక్ పై పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement