హైదరాబాద్ నగరంలోని మౌలాలి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ :నగరంలోని మౌలాలి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... మౌలాలిలోని మనీషా గార్డెన్ సమీపంలో ఉన్న ఓ వెల్డింగ్ దుకాణంలో వెల్డింగ్ చేస్తుండగా నిప్పులు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు తగలబడిపోయాయి. నిర్వాహకులు తక్షణమే స్పందించి మంటలు ఆర్పివేయటంతో పెను ప్రమాదం తప్పింది.